అచెంచుల విశ్వాసంతో..
● ఏటా కొండ దేవతకు పూజలు
● ఆచారాన్ని కొనసాగిస్తున్న చెంచులు
● ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి
నరసన్నపేట:
చెంచులు.. ఓ ప్రత్యేకమైన కొండ జాతి. తలకు నెమలి పింఛాలు ధరించి, చేతిలో డప్పులు, ముళ్ల మంచాలతో సంక్రాంతికి వీరు చేసే సందడి నిన్నటి తరానికి ఓ తీయని జ్ఞాపకం. శ్రీకృష్ణుడు, చెంచు లక్ష్మి మధ్య జరిగే కథ వినడం అప్పట్లో అందరికీ అలవాటే. కాలంతోపాటు అలవాట్లు మారిపోవడంతో చెంచుల ప్రాభవం తగ్గుతోంది. కొండ ప్రాంతాల్లో చెంచుల తెగకు చెందిన వీరు మైదాన ప్రాంతంలో జీవిస్తూ కూడా గిరిజన సంప్రదాయాలు పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదరణ లేకపోయినా తమ కష్టం మీదనే బతుకుతున్నామని గుండువల్లిపేటకు చెందిన చెంచులు అంటున్నా రు. పండగ రోజుల్లో ఇక్కడి 20 కుటుంబాల వారు వేషధారణతో ఊరూరా తిరుగుతారు. మిగతా సమయాల్లో వ్యవసాయం చేసుకుంటారు. తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెబుతున్నారు.
కొండదేవతకు పూజలు
ఏటా కార్తీక మూడో సోమవారం కొండదేవత(జాకిరి మరిడమ్మ)కు పూజలు చేస్తారు. అప్పటి నుంచి ఇతర పనులకు శ్రీకారం చుడతారు. అలాగే శ్రీకృష్ణుడు, చెంచు లక్ష్మిలను నమ్ముకున్నామని చెబుతారు. వారి కథే తమకు జీవనోపాధి అని, నెమలి పింఛాలు బరంపురం ప్రాంతంలో సేకరిస్తామని చెబుతున్నారు.
జీవన
శైలి


