రథసప్తమికి సామాన్యులకే పెద్దపీట
శ్రీకాకుళం పాతబస్టాండ్: రథసప్తమి ఉత్సవాల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గర్భగుడి ఎదుట నాలుగు వరుసల్లో దర్శనం కల్పించ డంద్వారా భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయా న్ని గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. మంగళవా రం కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణ పై ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండ కూడదన్నారు. ప్రతి సెక్టార్‌లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వీఐపీల రాక వల్ల సామాన్య భక్తుల క్యూ లైన్లకు ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. దాతల పాసులు ఉన్నవారికి నేరుగా ప్రవేశం ఉంటుందన్నారు. ఉత్సవా ల్లో భాగంగా ప్రతిరోజూ ఒక ప్రత్యేక వర్గానికి (మత్స్యకారులు, గిరిజనులు, ఇతర రాష్ట్రాల వా రు) ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కేఆర్ స్టేడియంలో చిన్నారుల కోసం ‘కిడ్స్‌జోన్’, అమ్యూజ్‌మెంట్ పార్కును సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఆహారం పంపిణీ చేసే దాతల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించా రు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడవద్దన్నారు. బందోబస్తుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఎస్పీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవె న్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్


