ఎచ్చెర్ల క్యాంపస్: విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ సెట్–2023 రెండో విడత కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ నెల 7 నుంచి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 11 వరకు ఆప్షన్ల నమోదు ఉంటుంది. 18న సీట్ల కేటాయింపు, 20 నుంచి 23 తేదీల మధ్య సీట్లు వచ్చిన విద్యార్థులు కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. పీజీ సెట్‌లో ర్యాంకు వచ్చి మొదటి విడతలో సీట్లు రాని, కోర్సులు, కళాశాలల్లో మార్పు కోరుకునే విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య సూచించారు.