ముదిగుబ్బ: ఒడ్డుకిందతండాకు చెందిన దంపతులిద్దరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వివరాలు.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొండగట్టుపల్లి ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నందిని పోటీ చేసి గెలుపొందారు. అదే ఇంట్లో ఆమె భర్త మునిస్వామి నాయక్ ఒడ్డుకిందతండా సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుతో గెలుపొందాడు. వారికున్న మంచి తనం, ప్రజల ఆదరణతో ఇద్దరు పదవులను దక్కించుకున్నారు. వీరిని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందుకూరి నారాయణరెడ్డి పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందించారు. ఐదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండాలను ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించారు. ఒడ్డుకింద తండా పంచాయితీ మొదటి సర్పంచ్‌గా ఇటీవల ఎంపీటీసీగా గెలుపొందిన నందిని అప్పట్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండవ సర్పంచ్‌గా మునిస్వామి నాయక్ ఎన్నిక కావడం విశేషం.


