ఊరూరా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

ఊరూరా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

● సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీ

మద్దతుదారులకు అండగా నిలవాలి

● వైఎస్సార్‌సీపీ శ్రేణులకు

ఉషశ్రీచరణ్‌ పిలుపు

గోరంట్ల: ‘‘అధికార పార్టీ దౌర్జన్యాలు, దాడులతో పంచాయతీ ఎన్నికలను ఏకపక్షం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ పార్టీ శ్రేణులంతా వైఎస్సార్‌సీపీ మద్దతుతో పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులకు అండగా నిలవాలి. విజయమే లక్ష్యంగా పనిచేయాలి. ఊరూరా వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరితీరాలి..ఇందుకోసం ప్రతి పార్టీ కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలి’’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని బూదిలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ... మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బూదిలి సర్పంచ్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ మద్దతుతో బారిలో నిలిచిన శివమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఆంజనేయులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు రవిచంద్రారెడ్డి, పంచాయతీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

బార్బర్‌ షాపు దగ్ధం

గుడిబండ: మండల కేంద్రంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో బార్బర్‌ షాపు దగ్ధమైంది. బాధితుడి వివరాల మేరకు.. మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లే దారిలో మహేష్‌ అనే వ్యక్తి షెడ్డులో బార్బర్‌ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ షాపులో మంటలు రేగి అందులోని వస్తువులన్నీ కాలిపోయాయి. ఘటనలో రూ.2.5 లక్షల వరకూ నష్టం నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రమాదంతో సర్వం కోల్పోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు దుర్గేష్‌ బాధితుడికి ఆర్థిక సాయం అందజేశారు.

పావగడలో

ఘోర రోడ్డు ప్రమాదం

● ముగ్గురి దుర్మరణం

పావగడ: పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుమకూరు రోడ్డు కణివేనహళ్లి గేట్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు అందించిన సమాచారం.. మడకశిర తాలూకా గొల్లపల్లికి చెందిన మేఘా(21), శ్రీనివాస్‌(45), నరసింహమూర్తి(36) పావగడ నుంచి స్వగ్రామాలకు బైక్‌పై బయలుదేరారు. కణివేనహళ్లి గేట్‌ వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు బైకు ను ఢీ కొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమ కుమారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఉరేసుకుని

బేల్దారి ఆత్మహత్య

గుత్తి: పట్టణంలోని కోట వీధిలో శుక్రవారం ఓ బేల్దారి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..కోట వీధికి చెందిన వెంకటేష్‌(35) బేల్దారిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన నొప్పి తీవ్ర కావడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటి పెద్ద దిక్కు ఉన్నఫళంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనౖపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement