శబరిమల భక్తులకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

శబరిమల భక్తులకు ప్రత్యేక రైళ్లు

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

● ఉమ్మడి అనంత జిల్లా మీదుగా

రైళ్ల రాకపోకలు

గుంతకల్లు: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుంచి కొల్లం, హైదరాబాద్‌ తదితర గమ్యస్థానాల మధ్య నడపనున్నారు. ఇవి ఉమ్మడి అనంత జిల్లాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

● 07187 హైదరాబాద్‌–కొల్లం ప్రత్యేక రైలు డిసెంబర్‌ 04, 18వ తేదీల్లో ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

● 07188 కొల్లం–కాజీపేట మధ్య ప్రత్యేక రైలు డిసెంబర్‌ 05, 19వ తేదీల్లో శనివారం రాత్రి 7.30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 4.00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది.

● 07171 సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–కొల్లం ప్రత్యేక రైలు డిసెంబర్‌ 11, 25వ తేదీల్లో శుక్రవారం ఉదయం 4.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

● 07172 కొల్లం–హైదరాబాద్‌ డెక్కన్‌ ప్రత్యేక రైలు డిసెంబర్‌ 12, 26వ తేదీల్లో శనివారం రాత్రి 7.30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 4.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

● 07173 హైదరాబాద్‌ డెక్కన్‌–కొల్లం మధ్య జనవరి 1,8,15వ తేదీల్లో శుక్రవారం ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

● 07174 కొల్లం–హైదరాబాద్‌ డెక్కన్‌ ప్రత్యేక రైలు జనవరి 2,9,16వ తేదీల్లో శనివారం రాత్రి 7.30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 4.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి తదితర స్టేషన్లలో స్టాపులు ఏర్పాటు చేశారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

మహిళా ఆరోగ్య కార్యకర్తల దరఖాస్తుదారులకు

నేడు కౌన్సెలింగ్‌

అనంతపురం సిటీ: మహిళ మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన వారికి శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని ప్రభుత్వ ఎంపీహెచ్‌డబ్ల్యూఎఫ్‌ శిక్షణా పాఠశాలలో 40 సీట్లకు గాను 46 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 39 మంది శిక్షణకు ఎంపికయ్యారు. శనివారం ఉదయం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయించనున్నారు. అభ్యర్థులు సరైన ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

దివ్యాంగులకు ఉచితంగా

కృత్రిమ అవయవాలు

అనంతపురం కల్చరల్‌: భారత వికాస పరిషత్‌ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి పరుచూరు రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అవసరమైన వారు వచ్చేనెల 12లోపు ‘శ్రీనివాస క్లాత్‌స్టోర్స్‌, రఘువీర టవర్స్‌ పక్కన, సుభాష్‌రోడ్డు, అనంతపురం’ చిరునామాలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9849508904 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement