బంగారు గొలుసు లాక్కెళ్లిన అగంతకుడు | - | Sakshi
Sakshi News home page

బంగారు గొలుసు లాక్కెళ్లిన అగంతకుడు

Nov 3 2026 12:45 AM | Updated on Nov 3 2026 12:45 AM

తనకల్లు: మండలంలోని చీకటిమానిపల్లిలో రమాదేవి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును సోమవారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రమాదేవి తెల్లవారుజామున తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిపోయాడు. గమనించిన రమాదేవి గట్టిగా కేకలు వేసింది. అయితే అప్పటికే అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. బంగారు గొలుసు విలువ దాదాపు రూ. 5 లక్షలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

టమాటాల

వాహనం బోల్తా

అమడగూరు: మండల పరిధిలోని గోపాల్‌నాయక్‌ తండా సమీపంలో బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఓడీచెరువు మండలం బోగానిపల్లి, నల్లగుట్లపల్లికి చెందిన నాగిరెడ్డి, రామమోహన్‌ నాయుడు బొలెరో వాహనంలో మొలకలచెరువుకు సోమవారం టమాటాలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న రైతులు, డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డారు.

తాగునీటి కోసం రాస్తారోకో

గుడిబండ: మండలంలోని పలు గ్రామాల్లో పూజారపల్లి, ఎస్‌.రాయాపురం, కొంకల్లు గ్రామాల్లో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. సమస్యను అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో పూజారపల్లి గ్రామ మహిళలు రోడ్డెక్కారు. సోమవారం ఖాళీ బిందెలతో మందలపల్లి నుంచి మడకశిర వైపుకు వెళ్లే రహదారిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలియజేశారు. మహిళలు మాట్లాడుతూ గత 15 రోజులుగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నపించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తక్షణమే యంత్రాంగం స్పందించకుంటే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు, మహిళలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement