ఔషధ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఔషధ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి

Nov 3 2026 12:45 AM | Updated on Nov 3 2026 12:45 AM

● కలెక్టర్‌ ఏ శ్యాం ప్రసాద్‌

ప్రశాంతి నిలయం: జిల్లాలో సుగంధ, ఔషధ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధ్యక్షతన సుగంధ,ఔషధ మొక్కల పెంపకంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మెడిసినల్‌ మొక్కలు బోర్డు సీఈఓ చంద్రశేఖర్‌ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమావేశంలో భాగంగా మొక్కల పెంపకంలో భాగస్వాములైన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సుగంధ, ఔషద మొక్కల పెంపకంపై లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 1,300 నుంచి 1,500 హెక్లార్టలో మొక్కల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. ఆసక్తి గల రైతులను,అనువైన భూములను గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్‌వో చక్రపాణి, సోషల్‌ ఫారెస్ట్రీ డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, ఉద్యాన శాఖ అధికారి జయకుమార్‌, వ్యవసాయం డీఏఓ కృష్టయ్య, డ్వామా పీడీ విజయప్రసాద్‌, సెరికల్చర్‌ జేడీ శోభారాణి,అధికారులు పాల్గొన్నారు.

4న పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులు ఈనెల 4న ఉదయం 6 గంటలకే మండలాల పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ ఏ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 5న పోలింగ్‌ నేపథ్యంలో ఈ నెల 4న పీఓలు,ఓపీఓలు,ఏపీవోలు ఉదయం 6 కల్లా పంపిణీ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల విధుల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.

హత్య కేసు నిందితుడు అరెస్టు

పెనుకొండ రూరల్‌: హత్యకేసు నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలను సీఐ శేఖర్‌ విలేకరులకు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాపురానికి చెందిన గొల్ల శ్రీనివాసులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం శ్రీనివాసులు పొలం వద్దకు వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన గొల్ల సత్యమప్ప గడారుతో మోది హత్య చేశాడు. మృతుని సోదరుడు రవీంద్రనాథ్‌ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతనికీ గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని హరిపురం జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement