రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతి

Nov 3 2026 12:45 AM | Updated on Nov 3 2026 12:45 AM

ఎర్రవల్లి: జాతీయ రహదారి–44పై ఆగి ఉన్న డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కోదండాపురం ఎస్‌ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు..

నంబులపూలకుంట మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మల్లికార్జున (39), తన బంధువుల కుమారుడు పల్లపు బాలాజీతో కలిసి ఆదివారం కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. బంధువులను అక్కడ దించి సొంతూరికి తిరిగి వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ధర్మవరం స్టేజీ సమీపంలో నిలిపి ఉన్న డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జునకు తీవ్ర గాయాలు కాగా, బాలాజీ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

తోడేలు దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు

పావగడ: తాలూకాలోని వళ్లూరు దళితవాడ వద్ద తోడేలు దాడిలో సోమవారం ఉదయం ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ముత్యాలమ్మ అనే మహిళ ఊరి బయటకు సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తోడేలు ఉన్నపళంగా ఆమైపె దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ముత్యాలమ్మ కుటుంబ సభ్యులు రామన్న, ఉష తోడేలును తరిమే ప్రయత్నం చేశారు. వారిపైనా తిరిగబడి దాడి చేసింది. గ్రామస్తులు గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ముత్యాలమ్మ ను మెరుగైన చికిత్స కోసం తుమకూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ముగ్గురిని గాయపరిచిన తోడేలు కూడా కుక్కల దాడిలో మృతి చెందడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement