రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

హిందూపురం(చిలమత్తూరు): రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక ధ్వజమెత్తారు. రాప్తాడులో జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది రంపంతో దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాప్తాడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతుండడం వల్లే బాలికలపై దురాగతాలు జరుగుతున్నాయన్నారు. శాంత్రి భద్రతల పరిరక్షణ పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించడంపైనే శ్రద్ధ పెడుతుండడంతో రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. రాప్తాడు ఘటనకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్‌ అనిత, ఎమ్మెల్యే పరిటాల సునీత తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల్లో ‘ఎల్లో తాలిబన్ల’ అరాచకాలు

రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని టీఎన్‌ దీపిక పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌లలో చొరబడి దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేయడం దుర్మార్గమని, ఇలాంటి పోకడలు ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. పులివెందులలో టీడీపీ మూకలకు పోలీసులు సహకరించడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఎల్లో తాలిబన్లులు చేసిన విధ్వంసకాండ దేశంలో మరెక్కడా జరగలేదని, రాష్ట్రంలో ప్రజలు ప్రశాంత వాతావరణం జీవించే పరిస్థితి లేదని తెలియజేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలు, దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పడం తథ్యమని స్పష్టం చేశారు.

రాప్తాడులో బాలికపై దాడి కలచివేసింది

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలం

సమన్వయకర్త టీఎన్‌ దీపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement