కొత్తచెరువు మండలంలో టీడీపీకి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్తచెరువు మండలంలో టీడీపీకి షాక్‌

Nov 1 2026 12:22 PM | Updated on Nov 1 2026 12:22 PM

పుట్టపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్తచెరువు మండలంలో టీడీపీకి షాక్‌ తగిలింది. కొత్తచెరువు మండలం నారేపల్లి, కదిరేపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయా గ్రామాలకు చెందిన చెండ్రాయుడు, రామన్న, ప్రసాద్‌, పోతులయ్య తదితర నాయకులతో పాటు సుమారు 20 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందని, స్థానిక ఎన్నికల్లో కష్ట పడేవారిని గుర్తిస్తుందన్నారు. అన్ని స్థానాల్లోనూ గెలిచి రావాలని సూచించారు.

పుట్టపర్తి: బుక్కపట్నం మండలం మదిరేబైలు తండాలో టీడీపీకి షాక్‌ తగిలింది. టీడీపీ అభివృద్ధికి కృషి చేసిన శనివారం సాయంత్రం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట ఽశ్రీధర్‌రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రాజుకుమార్‌ నాయక్‌, రవినాయక్‌, బాలునాయక్‌, విజయ్‌నాయక్‌, అమరనాథ్‌ నాయక్‌, రమణనాయక్‌, బి. రమణానాయక్‌, తదితర 20 కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పని చేసి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement