అగళి: మండలంలోని మధూడి గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సావాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్‌ను అర్చకులు విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అగ్నిగుండ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గుండంలో దూపాన్ని వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన లింగదబీరప్ప స్వాములు నృత్యంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మ రూపానికి అరటి కొమ్మలు అగ్నిగుండం వద్ద నాటి కొమ్మలు నరికి బలిదానం చేశారు. అర్చకులు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి అగ్నిగుండంలో ఉన్న నిప్పును తమ జోళిలో వేయించుకుని స్వామి వారి మూలవిరాట్ వద్దకు తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులు అగ్నిగుండంలో నడిచారు. జోళిక, కాళ్లు కూడా కాలవు, అదే విధంగా అర్చకుల ఇంటి నుంచి కలశంతో పాటు లింగదబీరులను ఊరేగింపుగా జంబీ వృక్షం వద్ద పూజలు నిర్వహించి వీరభద్రుడి సన్నిధిలో పట్టాన్ని కొలువుదీర్చారు.
అగ్నిగుండానికి పూజలు చేస్తున్న అర్చకులు
వేలాదిగా పాల్గొన్న భక్తులు
ఆకట్టుకున్న లింగదబీరప్ప
స్వాముల నృత్యం


