ఎరికలోడా.. నీకెందుకురా రాజకీయం | - | Sakshi
Sakshi News home page

ఎరికలోడా.. నీకెందుకురా రాజకీయం

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

ధర్మవరం: ‘‘ఏరా ఎరికలోడా... నీకెందుకురా రాజకీయం.. రాజకీయం మేం చేయాలా.. మీరు చూస్తూ ఉండాల. అంతేకానీ ఇలా మాతో పోటీ పడేందుకు నామినేషన్‌ వేస్తావా’’ అంటూ కూటమి నేతలు గిరిజన యువకులను హేళన చేయడంతో పాటు నామినేషన్‌ వేయకుండా అడ్డగించి అవమానపరిచారు. ఈ ఘటన శుక్రవారం బత్తలపల్లిలో చోటుచేసుకుంది.

వైఎస్సార్‌సీపీ అవకాశం ఇస్తే... అడ్డుకున్న కూటమి

బడుగు, బలహీన వర్గాలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయా వర్గాలకు రిజర్వేషన్లు మించి సీట్లిచ్చి పోటీకి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే మండలంలోని డి.చెర్లోపల్లి, తంబాపురం ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని గిరిజన యువకులకు కల్పించారు. దీంతో చివరిరోజు నామినేషన్‌ వేసేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులైన దామోదర్‌, గుజ్జల ఆంజనేయులు, గుజ్జల ప్రతాప్‌ తదితరులు వెళ్తుండగా... అగ్ర కులాలకు చెందిన కూటమి నాయకులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కులం పేరుతో వారిని దూషించి అవమానపరిచారు. నామినేషన్‌ పత్రాలను చింపి వెనక్కి పంపారు.

న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం..

తమకు జరిగిన అవమానం, అన్యాయంపై కోర్టుకు వెళ్తామని గిరిజన యువకులు దామోదర్‌, గుజ్జల ఆంజనేయులు, గుజ్జల ప్రతాప్‌ తెలిపారు. ఈ మేరకు వారు బత్తలపల్లిలో మీడియాతో మాట్లాడారు. తాము నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న కూటమి నేతలు కులం పేరుతో దూషిస్తూ, నామినేషన్‌ పత్రాలను చించివేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఒక గిరిజన అభ్యర్థిని కులం పేరుతో అవమానించి, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం అత్యంత తీవ్రమైందన్నారు. పోలీసులు కూడా తమను నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారన్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

గిరిజన యువకులను హేళన చేసిన కూటమి నేతలు

నామినేషన్‌ వేయకుండా అడ్డగింత...పత్రాల చించివేత

న్యాయం కోసం కోర్టును

ఆశ్రయిస్తామంటున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement