సత్యసాయి ఆకాంక్షల మేర వైద్య సేవల విస్తరణ | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి ఆకాంక్షల మేర వైద్య సేవల విస్తరణ

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

ప్రశాంతి నిలయం: కుల, మత. ప్రాంత బేధాల లేకుండా సత్యసాయి అందరికీ సమానత్వంతో నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందు సత్యసాయి వైద్య సేవలను ప్రారంభించారని, ఆయన ఆకాంక్షలను మేరకు వైద్య సేవలను విస్తృతం చేసేందుకు ట్రస్ట్‌ కృషి చేస్తోందని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె.రత్నాకర్‌ రాజు పేర్కొన్నారు. సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రశాంతి గ్రామ్‌లో యూరలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, సిమ్స్‌ ప్రశాంతి గ్రాం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాతీయ వర్క్‌షాప్‌ను ఆర్‌జే రత్నాకర్‌ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యసాయి పుట్టపర్తి పరిసర ప్రాంతాల పేదలకు ఉచిత వైద్యం కోసం 1956లో సత్యసాయి జనరల్‌ ఆసుపత్రిని ప్రారంభించారన్నారు. మొబైల్‌ ఆసుపత్రి ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు ఉచిత వైద్యం అందుతోందన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సుకు దేశ వ్యాప్తంగా పేరున్న 15 మంది ప్రముఖ యూరాలజిస్టులు సిమ్స్‌లో 8 ఆపరేషన్‌ థియేటర్లలో సుమారు 70 ఆధునాతన యూరాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్క్‌షాపులో పురుషులు, మహిళలకు సంబంధించిన రీకన్‌స్ట్రక్టివ్‌ శస్త్రచికిత్సలు, ఫీమేల్‌ స్లింగ్‌ సర్జరీ, పీసీఎన్‌ఎల్‌, మూత్రపిండాల్లో రాళ్లు, బైపోలార్‌ విధానం లాప్రోస్కోపీ వంటి శస్త్ర చికిత్సలు చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో సిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గురుమూర్తి, సిమ్స్‌ యూరాలజీ విభాగం పీజీ ట్రైనీ, యూరాలాజికల్‌ సోసైటీ ఆప్‌ ఇండియా అధ్యక్షులు డాక్టర్‌ కేశవ కుమార్‌, సిమ్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ కూమార్‌ మూల్పూర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిమ్స్‌ ప్రశాంతి గ్రామ్‌లో

యూరాలజీ వర్క్‌షాపు

జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును

ప్రారంభించిన ఆర్‌జే రత్నాకర్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement