● నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ సతీష్‌కుమార్
ధర్మవరం అర్బన్/పుట్టపర్తి టౌన్: నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, బీఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లోని నామినేషన్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి, అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అడిషనల్ ఎస్పీ మహేష్, డీఎస్పీలు జగన్నాథ్‌రాజు, శ్రీనివాసరావు, సీఐలు రెడ్డప్ప, జయానాయక్, సునిత, మహమ్మద్ అలీ, ఎస్ఐలు ఉన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రత
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేడుతున్నట్లు ఎీస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. నలుగురికి మించి గుంపుగా ఉండరాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్లే పోస్టులు, వివాదాలకు దారితీసే ప్రచారం చేసేవారిపై నిఘా ఉంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ఎన్నికల నిబఽంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
● జిల్లా ఎన్నికల పరిశీలకుడు
పి.అరుణ్ బాబు
ప్రశాంతి నిలయం: శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకుడు పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్ని కలు–2026 నిర్వహణకు సంబంధించి కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల పరిశీలకుడు అరుణ్ బాబు అధికారులనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి..
బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా ఉంచాలని అధికారులను జిల్లా పరిశీలకుడు ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించా రు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవ హరిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, అనంతపురం జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
నేటి పీజీఆర్ఎస్ రద్దు
ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: స్థానిక ప్రశాంతి రైల్వే స్టేషన్ వద్దనున్న రెవెన్యూ భవన్ లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ఈవిషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, పీజీ ఆర్ఎస్కు రావద్దని కలెక్టర్, ఎస్పీ ఆదివారం వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో తెలియజేశారు.


