లేపాక్షి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో అలంకరించారు. అమ్మవారిని వివిధ పూలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేకార్చనలు, తీర్థప్రసాద వినియోగాలు, మహామంగళారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాల్రావు ఆధ్వర్యంలో హిందూపురంలోని భృంగీ నృత్య కళాశాల విద్యార్థుల శాసీ్త్రయ నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.
మోహినీ అలంకరణలో ఖాద్రీశుడు
కదిరి టౌన్: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీవారు మోహినీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
నేడు రాజకీయ పార్టీలతో సమావేశం
ప్రశాంతి నిలయం: కొత్తచెరువులోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులతో చర్చించేందుకు సోమవారం సమావేశం ఉంటుందని జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి నాయకులు హాజరుకావాలని కోరారు.


