సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా పోటీలకు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా పోటీలకు ఎంపికలు

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

పుట్టపర్తి: 2026 – 27 సంవత్సరానికి గాను అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి ఏపీ రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ జట్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేర్లు నమోదకు ఆసక్తి కలిగిన సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు ఈనెల 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారకి 22న ధర్మవరంలోని బాలుర హైస్కూల్‌ గ్రౌండ్‌లో అథ్లెటిక్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌ బాల్‌, హాకీ, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్‌కు, 23న ధర్మవరంలోని కళాజ్యోతి ఇండోర్‌ స్టేడియంలో బెస్ట్‌ ఫిజిక్‌, క్యారమ్స్‌, చెస్‌, లాన్‌ టెన్నీస్‌, పవర్‌ లిఫ్టింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నీస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ యోగా క్రీడాంశాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9848187636ను సంప్రదించాలని చెప్పారు.

బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని

యువకుడిపై ఫిర్యాదు

గాండ్లపెంట: ప్రేమించకపోతే తన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని ఓ యువకుడు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఓ యువతి శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి తెలిపిన మేరకు వివరాలు. మండల పరిధిలోని సామాలగొంది గ్రామానికి చెందిన యువతి అన్నమయ్య జిల్లా పీలేరులో డిప్లమా చదువుతుండగా స్నేహితుల ద్వారా మండలంలోని నక్కతూరిపల్లి తండాకు నాగేంద్రనాయక్‌ పరిచయమయ్యాడని చెప్పింది. తన పర్సనల్‌ ఫొటోలు దగ్గరుంచుకుని ప్రేమించాలని లేదంటే ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని వేధిస్తున్నాడని తెలిపింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాను. ఇటీవల తనతో నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి నా ఇన్‌స్ట్రాగామ్‌లో లాగిన్‌ అయ్యి తన ఫొటోలు పంపి సంబంధం చెడగొట్టాడమే కాక తనను, తన తల్లిదండ్రులను వేధిస్తున్న నాగేంద్రనాయక్‌పై చర్యలు తీసుకోవాలంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement