ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

నమో నారసింహ

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం నమో నారసింహ నామస్మరణతో మార్మోగింది. భక్తులు ఆలయానికి పోటెత్తడంతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఖాద్రీశుని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి కాపులు తలనీలాలు సమర్పించుకున్నారు.

రొద్దం: మండల పరిధిలోని ఆర్‌.మరువపల్లి పాత చెక్‌పోస్టు వద్ద నిర్మాణంలో ఉన్న ఎంజేపీ పాఠశాల ఆవరణలో ఓ యువకుడు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. మండలంలోని రెడ్డిపల్లికి చెందిన దేవమ్మ, మత్తయ్య దంపతుల కుమారుడు వెంకటేష్‌ (28) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ చెక్‌పోస్ట్‌ వద్ద ఉండేవాడు. ఇతనికి వివాహమైంది. అయితే, భార్య విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెంకటేష్‌ మనస్తాపం చెందేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజ్‌కుళ్లాయప్ప తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement