జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

పుట్టపర్తి టౌన్‌: నిరంతరం సమాజ హితం కోసం తపించే జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణే తమ ధ్యేయమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, మంత్రి సత్యకుమార్‌ చొరవతో జర్నలిస్టులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 456 మంది పాల్గొని వైద్యం చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అహర్నిశలూ వార్తల సేకరణలో నిమగ్నమయ్యే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి పైరోజాబేగం, డీసీహెచ్‌ఎస్‌ క్రాంతి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీఓ కార్యాలయం తనిఖీ

లేపాక్షి: లేపాక్షి మండల పరిషత్‌ కార్యాలయాన్ని జిల్లా పరిషత్‌ సీఈఓ విజయలక్ష్మి శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు. కార్యాలయ నిర్వహణ, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకునే విధంగా ఉందని, కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఎంపీడీఓ వాసుదేవరెడ్డితో పాటు సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

పెనుకొండ రూరల్‌: పట్టణంలోని పలు హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. రెడ్డి హోటల్‌, సాయి కృప హోటల్‌లో శుభ్రత, నాణ్యతను పరిశీలించారు. సాయి కృప హోటల్‌ను రెండు రోజుల పాటు సీజ్‌ చేశారు. రెడ్డి హోటల్‌లో చికెన్‌ దమ్‌ బిర్యానీని ల్యాబ్‌ పరీక్షల నిమిత్తం పంపారు. ఆయా హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారి గణేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement