కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాది మంది సచివాలయ ఉద్యోగులు విజయవాడ బాట పట్టారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపుతో కదం తొక్కారు. రైళ్లు, ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. చంద్రబాబు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు.

ప్రాణాలు పోయినా పగ చల్లారలేదా?

‘చంద్రబాబు సర్కారు పని ఒత్తిడి కారణంగా మా సహచరులు వందమందికి పైగా తనువు చాలించారు. బాధిత కుటుంబాలు ఇంకా ఆవేదనలో ఉన్నాయి. అయినా సర్కారుకు పగ చల్లారినట్లు లేదు’ అంటూ సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో గ్రామ సర్వేయర్‌గా పనిచేస్తున్న రాష్ట్ర నాయకుడు బూరాడ మధుబాబును సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. సమస్యలపై అడిగితే సస్పెన్షనే బహుమానమా అని నిలదీశారు. మధుబాబుపై సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్‌ అడ్వానన్స్‌మెంట్‌ స్కీమ్‌, తొమ్మిది నెలల బకాయి వేతనాలు, పదోన్నతులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు రాజారెడ్డి ఉద్యోగుల ఆందోళనకు మద్దతిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక నాయకులు సుధాకర్‌, లకీ్‌ష్మ్‌నారాయణ, చిన్నూరప్ప, మల్లికార్జున, వరప్రసాద్‌, శివశంకరయ్య, నాగరాజు, ముత్యాలప్ప, రమేష్‌, విమల, కళావతి, శశికళ, దీక్షిత్‌బాబు, శంకర్‌రెడ్డి, మారుతిప్రసాద్‌, గంగాధర్‌, రవితేజ, అటకలప్ప, రవికుమార్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

‘చలో విజయవాడ’కు

తండోపతండాలుగా పయనం

చంద్రబాబు ప్రభుత్వంతో తాడోపేడో

తేల్చుకుంటామని స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement