కదిరి టౌన్: ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో కదిరి కోర్టు ఆవరణలో నిర్మించిన రెండో, మూడో అదనపు మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసాగిల్ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసి కక్షిదారులకు వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తులు బీఎస్ భానుమతి, కె.సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ తదితరులు ప్రత్యేక పూజలు చేసి కోర్టు భవనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా జడ్జిలతో వివిధ కేసులపై సమీక్షించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా జడ్జీలు, న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయికృష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి లోకనాథం, ఇన్‌చార్జ్ సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవన్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, కదిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు వరప్రసాద్, న్యాయవాదులు ప్రసాద్‌రెడ్డి, రామ్మోహన్, కె.నరసింహులు, పఠాన్ జాఫర్‌ఖాన్, సీవీ కృష్ణమూర్తి, ఫైజుల్లా, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
వర్చువల్‌గా ప్రారంభించిన
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసాగిల్


