నిత్యశ్రీ.. ఎందరికో స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

నిత్యశ్రీ.. ఎందరికో స్ఫూర్తి

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

తనకల్లు: మండల కేంద్రానికి చెందిన శ్రీవాణి, రెడ్డెప్ప దంపతుల కుమార్తె నిత్యశ్రీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయుల కూతురైన నిత్యశ్రీ చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచేది. దీంతో తల్లిదండ్రులూ ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చి... చదువుకు కావాల్సిన అన్ని వసతులను కల్పించారు. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదివిన నిత్యశ్రీ తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1లో సత్తాచాటారు. ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ సర్వీసులో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం కాకినాడలో డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆడపిల్ల భారం కాదు. ఆమెకు కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతుందని మా అమ్మాయి నిరూపించింది. ఈ కూతుళ్ల దినోత్సపం రోజున ఇంతకంటే గొప్ప బహుమతి మాకేం ఉంటుంది’ అని శ్రీవాణి, రెడ్డెప్ప దంపతులు భావోద్వేగంతో తెలపగా... ‘నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే అందుకు నా ప్రతిభ ఒక్కటే కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆడపిల్ల అని తక్కువగా చూడకుండా నా వెన్నుతట్టి ప్రోత్సహించిన నా తల్లిదండ్రులే కారణం’ అంటూ నిత్యశ్రీ తల్లిదండ్రులపై తన మమకారం చూపారు.

తల్లిదండ్రులు శ్రీవాణి, రెడ్డెప్ప,

తమ్ముడు సుమంత్‌తో నిత్యశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement