మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల జాప్యాన్ని అరికట్టాల
అనంతపురం: ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, పోలీసుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో నెలకొన్న జాప్యాన్ని అరికట్టాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ కోరారు. ఈ మేరకు ఏపీఎన్జీఓ నాయకులతో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరికి శనివారం విన్నవించారు. ఏడు నెలలుగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, పోలీసులకు సంబంధించి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరులో చోటు చేసుకున్న జాప్యాన్ని వివరించారు. ఈ అంశంపై స్పందించిన డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ.. నెల రోజుల్లోపు సమస్యకు పరిష్కారం చూపుతానని అన్నారు. కార్యక్రంమలో పుట్టపర్తి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు లింగా రామ్మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ బాబు, అనంతపురం జిల్లా సెక్రెటరీ రవికుమార్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి ఈశ్వర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీధర్ బాబు, ప్రవీణ్, వంశీ, హరికృష్ణ, పుట్టపర్తి సిటీ అధ్యక్షుడు దేవేంద్ర, సూరి తదితరులు పాల్గొన్నారు.


