పీఏబీఆర్‌లో నీటిమట్టం తగ్గుముఖం
కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. జీడిపల్లి జలాశయం నుంచి హంద్రీ– నీవా కాలువ ద్వారా 460 క్యూసెక్కుల నీరు వచ్చి డ్యాంలోకి చేరుతోంది. కాగా ధర్మవరం కుడి కాలువకు 710 క్యూసెక్కులు, అనంతపురం, సత్యసాయి,శ్రీరామరెడ్డి,ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. లీకేజీ, నీటి ఆవిరి రూపంలో 365 క్యూసెక్కులు బయటకు వెళుతోంది. మంగళవారం నాటికి డ్యాంలో 4.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పీఏబీఆర్‌లో నీటిమట్టం తగ్గుముఖం


