నాయకుల పెత్తనం.. రైతులకు కష్టం
ధర్మవరం రూరల్: స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఏపీ మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రంలో రాజకీయ నాయకుల పెత్తనం మితిమీరిపోతోంది. ‘కూటమి’ నాయకులు వ్యాపారులుగా మారి కంది కొనుగోలు కేంద్రంలో హల్‌చల్ చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, హమాలీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. తమ వారికి సంబంధించిన కందులను ముందుగా పట్టేలా చూస్తున్నారు. ‘ప్రభుత్వం మాది’ అంటూ వారికి సంబంధించిన సంచులను వాహనాల నుంచి ముందుగా దించుతుండ డంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారుతోంది. రోజుల తరబడి వేచి ఉంటూ అవస్థలు పడాల్సి వస్తోంది. ఇద్దరు నాయకులు అక్కడే ఉండి ప్రతి రోజూ ఎన్ని క్వింటాళ్ల కందులు పట్టారు.. ఎవరెవరికి సంచులు ఇచ్చారు అంటూ సిబ్బందిని హడలెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. తాము చెప్పిన వారివి మాత్రమే ముందుగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్రం వద్ద దళారులు, నాయకుల సంచారం లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీవారు
కంది కొనుగోలు కేంద్రంలో కూటమి నాయకుల హల్‌చల్
తమ వారివే కొనేలా సిబ్బంది, హమాలీలపై ఒత్తిళ్లు


