రీ సర్వే పక్కాగా చేపట్టాలి
● కలెక్టర్ శ్యాం ప్రసాద్
ప్రశాంతినిలయం: రీ సర్వే ఫేస్–3లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పక్కాగా చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో రీ సర్వేపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేను గడువులోపు పూర్తి చేయాలన్నారు. ముందుగా రైతుల నుంచి ఈ కేవైసీ తీసుకోవాలన్నారు. రీ సర్వేకు సంబంధించి వివరాలను తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఏడీ (సర్వే) విజయశాంతిబాయి, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
12న అంగన్‌వాడీల సమ్మె
పుట్టపర్తి అర్బన్: ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఐసీడీఎస్ పీడీ ప్రమీళకు సమ్మె నోటీసు అందజేశారు. దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నోటీసు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. ఫిబ్రవరి 12న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు–2025 రద్దు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, కనీస వేతనం పెంపు, మతోన్మాద కార్పొరేట్ విధానాలు తదితరాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సమ్మెలో ప్రతి కార్మికుడూ పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి వెంకటేషు, అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాబున్నీషా, ఉపాధ్యక్షులు భాగ్యలక్ష్మి, శారద, లక్ష్మీ, శాంతి, సుశీల, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కిరణ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ మారుతిప్రసాద్‌పై చర్యలు తీసుకుంటాం
● డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం
కదిరి టౌన్: మాతాశిశువుల మృతికి కారకుడైన డాక్టర్ మారుతిప్రసాద్‌పై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ పైరోజాబేగం తెలిపారు. మంగళవారం పట్టణంలోని పద్మావతి ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగుల రూమ్‌లు, ఆపరేషన్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆమె కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనీఖీ చేశారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. డీఎంహెచ్‌ఓ వెంట మెడికల్ ఆఫీసర్ నాగేంద్రనాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
రీ సర్వే పక్కాగా చేపట్టాలి
రీ సర్వే పక్కాగా చేపట్టాలి


