ఉత్సాహంగా ఉట్లమాను జాతర
గుడిబండ: మండలంలోని హిరేతుర్పి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను మూడు రోజల పాటు భక్తులు వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి అర్చకులు స్వామికి అర్చన, హోమాలు, అభిషేకాలు జరిపారు. సాయంత్రం ఉట్లమాను జాతర సందర్భంగా పైనుంచి బంకమట్టి పోస్తుండగా.. అధిరోహించడానికి యువకులు పోటీ పడ్డారు. యువత పడుతూ, లేస్తూ, చిందులు వేస్తూ గ్రామ ప్రజలకు, భక్తులకు ఆహ్లాదాన్ని పంచారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. బ్రహ్మోత్సవాలకు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఉట్లమాను జాతర


