జాతీయ జెండాకు అవమానం
చిలమత్తూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం ఉదయం జనసేన నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. అయితే రాత్రి ఎనిమిది గంటలైనా తొలగించకుండా ఉంచి అవమానించారు. జనసేన నాయకులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడంపై పలువురు మండిపడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జెండాను తొలగించడం గమనార్హం.
మహిళ బలవన్మరణం
ధర్మవరం అర్బన్: కడుపునొప్పి తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరం పట్టణంలో సోమవారం జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చాంద్‌బా షా, పఠాన్ రోష్ని (30) దంపతులు. చాంద్‌బాషా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోష్ని కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినా కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన రోష్ని సోమవారం ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలి తల్లి పర్హానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
సత్యసాయి వాటర్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం
బత్తలపల్లి: మండల కేంద్రానికి చెందిన మన్నీల సతీష్‌కుమార్ కనిపించకుండా పోయాడని అతని భార్య మన్నీల లీలావతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మన్నీల సతీష్‌కుమార్ 28 సంవత్సరాలుగా తాడిమర్రి మండలంలోని మద్దెలచెరువు రహదారిలోని శ్రీసత్యసాయి వాటర్ ప్లాంట్ నందు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం ఉదయం విధులకు వెళ్లిన ఆయన సాయంత్రం 6 గంటల సమయంలో తోటి ఉద్యోగి ద్విచక్రవాహనంలో బత్తలపల్లిలోని తాడిపత్రి బస్టాండ్ సర్కిల్‌లో దిగినట్లు కుమారుడు ఫోన్ చేయగా చెప్పారు. మరో 20 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆయన రాత్రి 7 గంటలైనా ఇంటికి రాలేదు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం భార్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
విడపనకల్లు: మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో సోమవారం పోలీసులు భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. వివరాలు.. మండలంలో టీడీపీ నాయకుల అండదండలతో కొందరు రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పాల్తూరు నుంచి ఐషర్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన ఐషర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనంలోని 155 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ ఉత్తమ కానిస్టేబుల్‌గా రాజశేఖర్
అనంతపురం క్రైం:ఆర్టీసీ ఉత్తమ కానిస్టేబుల్‌గా రాజశేఖర్ అవార్డు అందుకున్నారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయనకు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమల రావు అవార్డు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు రాజశేఖర్‌కు అభినందనలు తెలిపారు.
జాతీయ జెండాకు అవమానం
జాతీయ జెండాకు అవమానం
జాతీయ జెండాకు అవమానం
జాతీయ జెండాకు అవమానం


