పశుశాఖ జేడీ డాక్టర్ ప్రేమ్‌చంద్‌కు రాష్ట్ర స్థాయి అవార
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్‌కు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అలాగే, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) డాక్టర్ శ్రీకాంత్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ప్రకటించారు. రాయలసీమ జిల్లాల్లోనే తొలిసారిగా ‘అనంత పాలధార’ పేరుతో పాల దిగుబడి పోటీలు, లేగదూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశవ్యాధి శిబిరాన్ని అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి వేదికగా విజయవంతంగా నిర్వహించడం, పైలెట్ ప్రాజెక్టు కింద లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్‌ఎస్‌ఎస్) పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్ర స్థాయి అవార్డు దక్కినట్లు జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ తెలిపారు. అవార్డు రావడానికి సహకరించిన పశుశాఖ డీడీలు, ఏడీలు, వీఏఎస్, పారాస్టాఫ్ తదితరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో పశుశాఖ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.


