
త్రివర్ణ పతాకంతో ర్యాలీ
లేపాక్షి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లేపాక్షిలోని ఓరియంటల్ ఉన్నత పాఠశాల, ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులు 600 అడుగుల తివర్ణ పతాకాన్ని మంగళవారం ఉదయం ర్యాలీగా ప్రదర్శించారు. నంది విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి నెలకొల్పాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామపెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.