
నృత్యం ధార్మిక చింతనకు దోహదం
బొమ్మనహళ్లి : ధార్మిక చింతనకు నృత్యం కూడా దోహదం చేస్తుందని నాట్య కళాకారిణి, దంత వైద్యురాలు డాక్టర్ రాఘశ్రీ అన్నారు. బెంగళూరు నగరంలోని అక్నూరులో ఉన్న రాఘవేంద్రస్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొని నాట్య ప్రదర్శన ఇచ్చి మాట్లాడారు. నాట్యం భక్తులను ఆకట్టుకునే భగవంతుని సేవ అని అన్నారు. ఇందుదకు బేలూరులో చెన్నకేశవస్వామి ఆలయంలోని శాంతలా దేవి శిల్పాలే నిదర్శనమన్నారు.
కౌశల్యాలను పెంపొందించుకోవాలి
చిక్కబళ్లాపురం : విద్యార్థులు కౌశల్యాలను వృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర కౌశల్య అభివృద్ధి మండలి అధ్యక్షురాలు శివకాంతమ్మ నాయక్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలనా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ నుంచి 12వ తరగతి వరకు కౌశల్య అభివృద్ధికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ పీఎన్ రవీంద్ర, జిల్లా పంచాయత్ ఉప కార్యదర్శి అతిక్ పాషా, పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగప్ప పాల్గొన్నారు.

నృత్యం ధార్మిక చింతనకు దోహదం