
వీల్ చైర్ టెన్నిస్ టోర్నీలో విజయకేతనం
బొమ్మనహళ్లి : చైన్నెలో జరిగిన జాతీయ స్థాయి వీల్‌చైర్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర జట్టు విజయకేతం ఎగరవేసి ఆరు పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో శేఖర్ చాంపియిన్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్, డబుల్స్‌లో ప్రతిమారావు రన్నరప్‌గా నిలిచారు. క్రీడాకారుల సాధనను వీల్‌చైర్‌టెన్నిస్ సంస్థ అధ్యక్షుడు చంద్రకాంత్ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతుందన్నారు.
ఘనంగా వీరాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
చిక్కబళ్లాపురం: జిల్లా కేంద్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ జీర్ణోద్ధారణలో భాగంగా వీరాంజనేయస్వామి రాతి విగ్రహహ ప్రతిష్టాపన, విమానగోపురం, రాజగోపురం మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాగణపతి హోమం, స్పర్శాహుతి, 108 ద్రవ్యాహుతి కార్యక్రమాలను నెరవేర్చారు. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇదే సందర్భంలో సామూహిక వివాహలు నిర్వహించారు. శ్రీ సిద్దేశ్వరస్వామీజీ వధూవరులను ఆశీర్వదించారు. దేవరాజు అరసు మెడికల్ కళాశాల అధ్యక్షడు జీహెచ్ నాగరాజు కుమారుడు వినయ్‌శామ్, కుటుంబసభ్యులు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు

వీల్ చైర్ టెన్నిస్ టోర్నీలో విజయకేతనం