మా రూటే సప‘రేటు’! | - | Sakshi
Sakshi News home page

మా రూటే సప‘రేటు’!

Aug 12 2025 11:13 AM | Updated on Aug 13 2025 7:46 AM

మా రూ

మా రూటే సప‘రేటు’!

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్‌ పోలీసులే కాదు సివిల్‌ పోలీసుల దందా మరీ ఎక్కువైంది. మద్యం షాపుల వారు మామూళ్లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎకై ్సజ్‌ పోలీసులూ, తాము ఒకటి కాదని, వాళ్లకిస్తే తమకిచ్చినట్టు కాదంటూ బహిరంగంగానే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సివిల్‌ పోలీస్‌ స్టేషన్‌కూ మామూళ్లు వెళ్లకపోతే వైన్‌షాపు నడుపుకోలేరని హెచ్చరిస్తున్నారు. లేకుంటే పర్మిట్‌ రూములు, బెల్టుషాపులకు అనుమతి లేదంటున్నారు.

అడిగినంత ఇస్తే దర్జాగా..

మామూళ్లు ఇస్తే దర్జాగా వ్యాపారం చేసుకోవచ్చు. ఉదాహరణకు అనంతపురంలోని రామ్‌నగర్‌ బ్రిడ్జి కింద ఓపెన్‌ బార్‌లా వైన్‌షాపు నడుస్తోంది. మహిళలు ఈ మార్గంలో నడుచుకు వెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు ప్రతి నెలా రూ.25 వేలు వెళ్తోంది. ఇలా శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో దర్జాగా పర్మిట్‌ రూములు, బెల్టుషాపులు నడుపుకోవాలంటే ఎకై ్సజ్‌ పోలీసులతో పాటు సివిల్‌ పోలీసులనూ సంతృప్తి పరచాల్సిందేనని తెలి సింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు రాయాల్సింది ఎకై ్సజ్‌ అధికారులే. కానీ తాము లేకుండా వ్యాపారాన్ని చేసుకోలేరని సివిల్‌ పోలీసులు చెబుతున్నట్లు సమాచారం.

అర్బన్‌లో ఎక్కువగా..

శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 230 వరకూ వైన్‌ షాపులు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పోలీస్‌ స్టేషన్లలో ఇచ్చినంత తీసుకుని చూసీ చూడనట్టు వెళుతున్నారు. కానీ అనంతపురం అర్బన్‌లో మాత్రం కచ్చితంగా ఫిక్స్‌ చేసినంత ఇవ్వాల్సిందే. ఉదాహరణకు నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 9 షాపులున్నాయి. ఆయా వైన్‌ షాపుల నిర్వాహకు లంతా కలిసి నెలకు తప్పనిసరిగా రూ.1.80 లక్షలు ఇవ్వాల్సిందే. బార్‌లూ ఫిక్స్‌ చేసినంత ఇవ్వాలి. వన్‌టౌన్‌ పీఎస్‌కు కూడా అంతేనని తెలిసింది.

ధాబాలు.. హోటళ్లు ఉంటే బోనస్‌

వైన్‌షాపులతో పాటు ధాబాలు, హోటళ్లు ఉంటే సివిల్‌ పోలీసులకు బోనస్‌ కింద లెక్క. జాతీయ రహదారిపై ఉన్న ప్రతి ధాబా, హోటల్‌లోనూ లిక్కర్‌ సిట్టింగ్‌ ఉంది. ఇక్కడ తనిఖీలకు వెళ్లాల్సింది కూడా సివిల్‌ పోలీసులే. దీంతో ధాబాలు, హోటళ్లు శక్తిని బట్టి నెలనెలా ఇవ్వాల్సిందే. ఇక బార్‌లు కూడా స్టేషన్‌కు మామూళ్లు పంపించాల్సిందే. పోలీసులేమో డ్రోన్‌లతో నిఘా అంటూ చెప్పి బహిరంగ మద్యపానం చేస్తున్నారంటూ రిక్షా కార్మికుడినో, తాపీ మేస్త్రీనో తెచ్చి స్టేషన్లో పెడుతున్నారు.

బాస్‌కు తెలిసే..

మామూళ్ల దందా ‘పోలీస్‌ బాస్‌’కు తెలిసే జరుగుతోందని, ఇంత విచ్చలవిడిగా సాగుతున్న విషయం తెలియకుండా ఎలా ఉంటుందని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. విచిత్రమేమంటే కొన్ని పోలీసుస్టేషన్లలో వచ్చిన సొమ్ము మొత్తం సీఐ తీసుకుంటున్నారని, తమకు పైసా ఇవ్వడం లేదని ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

ఎకై ్సజ్‌ వారిలా తమకూ

మామూళ్లివ్వాలంటున్న సివిల్‌ పోలీసులు

వైన్‌ షాపుల నిర్వాహకులకు హుకుం

స్టేషన్‌ పరిధిలో ఒక్కో వైన్‌షాపు నుంచి రూ.20 వేలు డిమాండ్‌

మా రూటే సప‘రేటు’! 1
1/1

మా రూటే సప‘రేటు’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement