
విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: వరుణుడు తొమ్మిది రోజులుగా తెరిపినివ్వడం లేదు. జిల్లా అంతటా విస్తారంగా వర్షిస్తూ చెరువులకు జలకళ తెచ్చాడు. ఆదివారం రాత్రి నుండి సోమవారం వరకూ జిల్లాలోని 32 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఒక్కరోజే 24.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ధర్మవరం మండలంలో 67.4 మి.మీ, అమరాపురం మండలంలో 56.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తనకల్లు మండలంలో 48.2 మి.మీ, కొత్తచెరువు 47, బుక్కపట్నం 44, కదిరి 42.4, చిలమత్తూరు 33.4, పెనుకొండ 31.4, కనగానపల్లి 30.8, అమడగూరు 30.4, పుట్టపర్తి 28.4, సీకేపల్లి 25.4, ముదిగుబ్బ 24.8, తాడిమర్రి 24.2, రొద్దం 23.6, నల్లమాడ 23.2, నల్లచెరువు 22.2, హిందూపురం 21.2, లేపాక్షి 20.8, రొళ్ల 19.2, గాండ్లపెంట 18.6, గుడిబండ 18.2 , సోమందేపల్లి 17.6, పరిగి 16.2, బత్తలపల్లి 14.2, అగళి 10.6, ఓడీచెరువు 8.2, మడకశిర 7.6, రామగిరి 6.2, తలుపుల 2.8, గోరంట్ల 2.2, ఎన్‌పీకుంట మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కోలుకున్న పంటలు.. పెరిగిన చీడపీడలు
తాజా వర్షాలతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు ఆశాజనకంగా ఉన్నా.. తెగుళ్లు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. వేరుశనగ, కంది పంటలకు చీడ పీడలు అధికమయ్యాయంటున్నారు. కూరగాయల పంటలకూ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక కొన్నిరోజులుగా కురుస్తున్న జడివానతో అక్కడక్కడా ఇళ్లు కూలుతున్నాయి. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లా అంతటా జడివాన
సోమవారం 24.6 మి.మీ
సగటు వర్షపాతం నమోదు

విస్తారంగా వర్షాలు