
ఎకరాకు రూ.3 వేలు అదనపు భారం
ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి ఎరువుల ధరలు పెంచుతోంది. కొన్నిచోట్ల ఎమ్మార్పీ మించి ధర వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.3 వేలు చొప్పున అదనపు భారం పడుతోంది. పంటకు గిట్టుబాటు ధరలు కూడా అంతంత మాత్రమే. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
–వై.శ్రీధర్‌రెడ్డి, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం
సేంరద్రియ ఎరువుల వాడకం
పెంచాలి
రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. అలా చేస్తే దిగుబడులు పెరగడంతో పాటు పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది. జిల్లాలోఎక్కడైనా అధిక ధరలకు ఎరువులు అమ్మితే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తాం. కృత్రిమ డిమాండ్ సృష్టించినా చర్యలు తప్పవు.
–సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి

ఎకరాకు రూ.3 వేలు అదనపు భారం