
ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం
పుట్టపర్తి టౌన్: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం దక్కుతుందని జిల్లా చిన్న పత్రికల ఎడిటర్ల సంఘం అధ్యక్షుడు బీరే ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని ఓ హోటల్‌లో చిన్న పత్రికల ఎడిటర్ల జిల్లా స్థాయి సమావేశంలో ఆదివారం జరిగింది. సమావేశానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీ నారాయణ ముఖ్యఅతిథిలుగా హారయ్యారు. ఈ సందర్భంగా చిన్న పత్రికల ఎడిటర్ల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కోట్లపల్లి బాబా (హిందూపురం), సలహాదారుగా గోవిందప్ప (మడకశిర), జిల్లా అధ్యక్షుడిగా బీరే ఈశ్వరయ్య (గోరంట్ల), ప్రధాన కార్యదర్శిగా రాజు (పుట్టపర్తి), జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రతాపరెడ్డి (ధర్మవరం), వెంకటేష్ (కదిరి), ట్రెజరర్‌గా నారాయణ (హిందూపురం), సహాయ కార్యదర్శులుగా గంగాధర్ (కదిరి), గురుప్రసాద్ (ధర్మవరం), కార్యవర్గ సభ్యులుగా ఇమ్రాన్, అశోక్, శ్రీనివాసులు, మహేంద్ర, రామచంద్ర ఎన్నికయ్యారు. అనంతరం బిరే ఈశ్వరయ్య మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లాలోని చిన్న పత్రికల ఎడిటర్లు పాల్గొన్నారు.