
● అ‘పూర్వ’ సమ్మేళనం
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారందరూ 20 ఏళ్ల తర్వాత అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. నాడు దాదాపు 180 మంది కలిసి చదువుకోగా, ఇందులో 120 మంది హాజరయ్యారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసి పోయారు. విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువును ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ అపూర్వ కలయికకు నేతృత్వం వహించిన పూర్వ విద్యార్థి మంజునాథ్ (కానిస్టేబుల్)ను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం ముజఫర్ హుస్సేన్ మాట్లాడుతూ... రూ.5 లక్షల వ్యయంతో పాఠశాలలో సభావేదికను నిర్మించిన పూర్వవిద్యార్థులను అభినందించారు.