
కర్ణాటక వాసి దుర్మరణం
నల్లచెరువు: మండల కేంద్రానికి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటక వాసి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా దిబూరహళ్లికి చెందిన వరుణ్ కుమార్ (32) బొలెరో వాహన డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం నల్లచెరువు సంత తోపు వద్ద బొలెరొ వాహనంలో ఖాళీ క్రేట్లను లోడ్ చేసుకుని జాతీయ రహదారి మీదుగా కదిరి వైపుగా బయలుదేరాడు. నల్లచెరువు శివారులోకి చేరుకోగానే ఎదురుగా కదిరి వైపు నుంచి ఎల్‌పీజీ సిలిండర్లతో మదనపల్లి వైపుగా వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. వరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.