
రాష్ట్రం మరో బిహార్‌లా మారింది
పెనుకొండ రూరల్: బీసీ నేతలపై దాడులకు పాల్పడటం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ నేత రామలింగారెడ్డిపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. జెడ్పీటిసీ ఉప ఎన్నిక వేళ టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటం సరికాదన్నారు. బీసీ నేతలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు తెగపడడం రెడ్‌బుక్ రాజ్యంగానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేకనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా చేసుకొని దాడులు చేయడమేకాకుండా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం మరో బిహార్‌లా మారిందన్నారు. కూటమి పాలనలో దాడులు తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు.
ప్రజలకు పండుగ శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్: ధనం, ధాన్యం, సంపద, విజయం అందించే మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే జిల్లా ప్రజలకు ఆమె వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇళ్లూ భోగ భాగ్యాలు సకల సంపదలతో విరాజిల్లాలని దేవుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బీసీ నేతలపై దాడులు సరికాదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్