
జిల్లా క్రీడా జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం హిందూపురంలోని ఎంజీఎం క్రీడామైదానంలో వివిధ క్రీడా జట్ల ఎంపిక చేశారు. పోటీలను మున్సిపల్ డీఈ రమేష్‌కుమార్ ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలలో 22 ఏళ్ల లోపు పురుషులు, మహిళల క్రీడా జట్లను ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది పురుషులు, 150 మంది మహిళలు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకూ తిరుపతిలో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడ ప్రతిభ చాటిన వారిని విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ ఉదయ భాస్కర్, ఎంజీఎం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పాండురంగనాయకులు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ మొరార్జీ యాదవ్, పీడీ, పీఈటీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్, పీడీ లోక్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు.