మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరలను నియంత్రించడంతో పాటు చౌకధాన్యపు దుకాణాల ద్వారా నిరుపేదలకు రేషన్‌ సరుకులు అందించాల్సి ఉంది. కానీ కూటమి సర్కార్‌కు ప్రచారం తప్ప... పేదల ఆకలి కేకలు పట్టడం లేదు. రేషన్‌ సరుకుల్లో ఇవ్వాల్సి | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరలను నియంత్రించడంతో పాటు చౌకధాన్యపు దుకాణాల ద్వారా నిరుపేదలకు రేషన్‌ సరుకులు అందించాల్సి ఉంది. కానీ కూటమి సర్కార్‌కు ప్రచారం తప్ప... పేదల ఆకలి కేకలు పట్టడం లేదు. రేషన్‌ సరుకుల్లో ఇవ్వాల్సి

Aug 7 2025 10:37 AM | Updated on Aug 7 2025 10:37 AM

మార్క

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరి

ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో కూటమి సర్కార్‌ కొలువుదీరాక పౌరసరఫరాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఏడాదిగా నిత్యావసర సరుకులు సరిగా పంపిణీ చేయకుండా నిరుపేదలను వేధిస్తోంది. గతంలో ఇచ్చే కందిపప్పుకు పూర్తిగా మంగళం పాడింది. ఇప్పుడు కేవలం బియ్యం, అరకొరగా చక్కెర అందించి చేతులు దులుపుకుంటోంది.

5.76 లక్షల కుటుంబాలకు కందిపప్పు కట్‌..

జిల్లాలో 5,76,632 రేషన్‌ కార్డులుండగా, 1,367 రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకు ప్రతి నెలా రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 8,600 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 430 మెట్రిక్‌ టన్నుల చక్కెర, 576 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం మాత్రమే అందిస్తోంది. చక్కెర అరకొరగా ఇస్తూ, కందిపప్పును పూర్తిగా బంద్‌ చేసింది.

మార్కెట్‌లో కొనలేక..

కిలో కందిపప్పు మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా రూ.67లకే కిలో కందిపప్పును ప్రభుత్వం అందించేది. కానీ కూటమి సర్కార్‌ కందిపప్పు ఇవ్వకపోవడంతో నిరుపేదలు మార్కెట్‌లో అంత ధర వెచ్చించి కందిపప్పు కొనలేకపోతున్నారు. ఈ నెలలో వినాయక చవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మి వ్రతం తదితర పండుగలుండగా... కనీసం ఈ నెల అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రేషన్‌ సరుకులు అందిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ నెల కోటాలో కూడా బియ్యం, అరకొర చక్కెరతో సరిపెట్టింది. దీంతో నిరుపేదలు పప్పుకోసం అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రేషన్‌ పంపిణీలో నిర్లక్ష్యం..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి రేషన్‌ సరుకులు అందించే వారు. క్రమం తప్పకుండా బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేసేవారు. ఇళ్ల ముంగిట్లోనే రేషన్‌ సరుకులు అందుతుండటంతో పేదలు ఎంతో సంతోషించే వారు. కానీ కూటమి ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీని అస్తవ్యస్తం చేసింది. తొలుత ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేసే వాహనాలను తొలగించింది. అంతేకాకుండా రేషన్‌ సరుకుల్లోనూ కోతలు విధించింది. కందిపప్పు, రాగులు, గోధుమపిండికి పూర్తిగా మంగళం పాడింది. ప్రస్తుతం ప్రతి నెలా బియ్యం మాత్రం అవసరమైన మేరకు పంపిణీ చేస్తోంది. పంచదార కూడా అరకొర మాత్రమే అందిస్తోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క నెల కూడా పూర్తిస్థాయిలో రేషన్‌ సరుకులు పంపిణీ చేయకపోవడంతో కూటమి సర్కార్‌పై నిరుపేదలు శాపనార్థాలు పెడుతున్నారు.

పేదింట ఉడకని పప్పు

రేషన్‌ సరుకుల్లో ఇవ్వని

కూటమి సర్కార్‌

బియ్యం, పంచదారకే పరిమితం

మార్కెట్‌లో పెరిగిన కంది పప్పు ధర

పప్పుచారుకూ నోచుకోలేని స్థితిలో నిరుపేదలు

ప్రభుత్వం ఇస్తే పంపిణీ చేస్తాం

ప్రభుత్వం ఆగస్ట్‌ నెలకు సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసింది. కందిపప్పు ఇంకా ఇవ్వలేదు. ప్రభుత్వం సరఫరా చేస్తే రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకుకందిపప్పు అందిస్తాం. – వంశీకృష్ణారెడ్డి,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరి1
1/1

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement