
వేలాంకణికి ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తమిళనాడులోని నాగపట్నంలో వెలసిన వెలాంకణి ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మినల్ – వెలాంకణి ప్రత్యేక రైలు (09093) ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9–40 గంటలకు బాంద్రా టెర్మినల్ బయలుదేరి రెండో రోజు ఉదయం 7–40 గంటలకు వెలాంకణికి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో రైలు (09094) వెలాంకణిలో ఈ నెల 30, సెప్టెంబరు 9 తేదీల్లో అర్ధరాత్రి 12–30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బాంద్రా టెర్మినల్‌కు చేరుకుంటుందన్నారు. రాయలసీమ జిల్లాలోని మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణుగుంటల మీదుగా ప్రయాణిస్తుందన్నారు.
14, 15 తేదీల్లో బీదర్ స్పెషల్ రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 14, 15వ తేదీల్లో బెంగళూరు–బీదర్– బెంగుళూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 14వ తేదీ బెంగళూరు జంక్షన్ (06519) నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు బీదర్ జంక్షన్‌కు చేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ నుంచి బయలుదేరిన రైలు (06520) మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యద్గారి, షాహబాద్, కలబురిగి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
కోయంబత్తూర్–జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
కోయంబత్తూర్–జైపూర్–కోయంబత్తూర్ మధ్య ఈ నెల 7 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ ప్రతి గురు, ఆదివారాల్లో దాదాపు 10 సర్వీసులను నడపనున్నారు. కోయంబత్తూర్ జంక్షన్ నుంచి ఈనెల 7న రాత్రి 2.30 గంటలకు బయలుదేరిన రైలు (06181) మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు జైపూర్ జంక్షన్‌కు చేరుతుంది. తిరిగి ఈ నెల 10న రాత్రి 10.05 గంటలకు జైపూర్ జంక్షన్ బయలుదేరిన రైలు (06182) మూడో రోజు ఉదయం 8.30 గంటలకు కోయంబత్తూర్ జంక్షన్‌కు చేరుతుంది. తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలర్‌పెట్టి, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.