
ఏడు గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
ధర్మవరం: గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండడంతో ఏడు సిలిండర్లను విజిలెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజిలెన్స్ ఎస్‌ఐ వెంకటప్రసాద్ తెలిపారు. ధర్మవరంలోని రంగా థియేటర్ సమీపంలో ఉన్న చెన్నాదేవి ప్రభ షాపులో మంగళవారం డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ ఉంచి చట్ట విరుద్ధంగా వ్యాపారం చేయడాన్ని గుర్తించారు. 7 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. యజమాని చెన్నదేవి ప్రభపై కేసు నమోదు చేశారు.