
పేకాట రాయుళ్ల అరెస్ట్
పుట్టపర్తి అర్బన్: స్థానిక పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో సోమవారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 26 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారని డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. పుట్టపర్తి మండలం పైపల్లి శివారున పేకాట ఆడుతూ బత్తలపల్లి ప్రసాద్, అమగొండపాళ్యం సంతోషకుమార్, చంద్ర, పుట్టపర్తికి చెందిన వెంకటేష్, సాయినగర్‌కు చెందిన అంజినప్ప, కొత్తచెరువు మండలం కమ్మపాలెం నివాసి సాకే చిన్న తిప్పన్న, కర్ణాటక నాగేపల్లికి చెందిన సాకే శ్రీరాములు, అంజి, రవిసాయి, సాయినాథ్, సుబ్బరాయుడు, వెంగళమ్మచెరువు నివాసి నాగేంద్ర, బీడుపల్లి కుళ్లాయప్ప, పుట్టపర్తికి చెందిన బోయ సాయికృష్ణ తదితర 15 మంది పట్టుబడినట్లు వివరించారు. వీరి నుంచి రూ.2.03 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. తనిఖీల్లో కొత్తచెరువు అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ మారుతీశంకర్, ఎస్‌ఐ లింగన్న, సిబ్బంది పాల్గొన్నారన్నారు. అలాగే బుక్కపట్నం మండలం మదిరేబైలు, రెడ్డిపల్లి గ్రామాల శివారున పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి, రూ.2.03 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ కడప జిల్లా పోట్లదుర్తికి చెందిన శివరామిరెడ్డి, పులివెందులలోని అహోబల్లాపురానికి చెందిన పాలకొండ్రాయుడు, ఎర్రగుంట్ల మండలం హనుమన గుత్తికి చెందిన సంతోష్‌రెడ్డి, సున్నపురాళ్లపల్లికి చెందిన ఆకుమల్ల రాజేస్, జమ్మలమడుగు మండలం గూడెం చెరువు నివాసి జమాల్ బాషా, ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ నివాసి శ్రీనివాస్, కడపకు చెందిన షేక్ ఇలియాజ్, వేముల మండలం భూమయ్యగారిపల్లి నివాసి రామాంజనేయరెడ్డి, కమలాపురం మండలం దేవరాజుపల్లికి చెందిన నరసింహారెడ్డి, పోరుమామిళ్ల మండలం ఉద్దీకట్ల గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా, కడపలోని శంకరాపురం నివాసి శ్రీనాథ్ ఉన్నారు.