
పరిష్కార వేదికకు 75 వినతులు
పుట్టపర్తి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 75 వినతులు అందాయి. డీఎస్పీ ఆదినారాయణ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజరీ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.
బాలుడి ఆచూకీ తెలపండి
పద్దెనిమిదేళ్ల వయసున్న తమ కుమారుడు ఓంకారేశ్వర్ కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలపాలంటూ తాడిమర్రికి చెందిన లక్ష్మీదేవి, గంగాధర దంపతులు వేడుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ ఆదినారాయణకు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి కుమారుడు కనిపించడం లేదన్నారు. ఇప్పటికే మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి మాయ మాటలతో పిలుచుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. యువతిని, ఆమె తల్లిదండ్రులను విచారణ చేస్తే తమ కుమారుడి ఆచూకీ తెలుస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థించారు.