
వివాహిత ఆత్మహత్య
అగళి: మండలంలోని దొక్కలపల్లి గ్రామానికి చెందిన చిత్తప్ప భార్య పుట్టక్క (52) ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న పుట్టక్క కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో సోమవారం పత్తి పంటకు వినియోగించే పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్ణాటకలోని తుమకూరులో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఆస్పత్రిలో మృతిచెందారు. కుమారుడు శివలింగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.