
‘కూటమి’ మాట.. మోయలేని మూట
ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని టీడీపీ కూటమి సర్కార్ నిలిపివేయడంతో వృద్ధులు, వికలాంగులకు తిప్పలు తప్పడం లేదు. జూలై నుంచి వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం.. క్షేత్ర స్థాయి అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. నడుము వంగి నడవలేని స్థితిలో ఉన్న పుట్టపర్తి మండలం పెడపల్లి చిన్న తండాకు చెందిన వృద్ధురాలు మంగ్లీబాయికి ఒంటరి మహిళ కింద 5 కిలోల బియ్యాన్ని పెడపల్లి పెద్ద తండాలోని చౌకధాన్యపు డిపోలో అందజేశారు. ఈ ఐదు కిలోల బియ్యం మూటను ఆమె ప్రతి అడుగుకు ఓసారి కింద పెడుతూ అతి కష్టంపై ఇంటికి చేర్చింది. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వ మాటలు వింటే కష్టాలు తప్పవని నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు.
– పుట్టపర్తి అర్బన్: