
యువత పెడదోవ
బెల్టుషాపుల్లో
మద్యం విక్రయాల జోరు
కదిరి టౌన్: బెల్టుషాపుల ద్వారా మద్యం అనధికార విక్రయాలు ఊపందుకున్నాయి. ఏ సమయంలో అయినా తాగినోళ్లకు తాగినంత అందుబాటులో ఉంటోంది. అయితే ఇక్కడ ప్రతి బాటిల్‌పైనా ఎమ్మార్పీకి మించి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. మందుకు అలవాటుపడిన వారు వైన్ షాపులకు వెళ్లలేక చెంతనే ఉన్న బెల్టుషాపులను ఆశ్రయిస్తున్నారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి. ఒక్క కదిరి పట్టణంలోనే 60 దాకా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. బెల్టుషాపుల మాటున అక్రమార్జనే ధ్యేయంగా అధికార తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పోటీపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బెల్టుషాపుల్లో క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.30, హాఫ్‌పై రూ.60, ఫుల్‌బాటిల్‌పై రూ.120, బీరుపై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్‌షాపులో ఉండే ప్రతి బ్రాండ్ మద్యమూ బెల్టు షాపుల్లోనూ లభిస్తుండటం గమనార్హం. మద్యం అక్రమ అమ్మకాలు, అదనపు వసూలు గురించి తెలిసినా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కదిరి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధివీధినా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో మద్యానికి బానిసైన యువత పెడదోవ పడుతోంది. ఇక నిర్వాహకులు సిండికేట్ కావడంతో మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 దాకా అదనంగా దండుకుంటున్నారు. కూలి పనిచేసుకొని జీవనం సాగించేవారు తమ సంపాదనలో 60 శాతం మేర మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
– జీఎల్.నరసింహులు,
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు

యువత పెడదోవ