
కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి
కడప ఎడ్యుకేషన్: కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులను చదువులో దిట్టలుగా మార్చాలని కేజీబీవీ సబ్జెక్టు టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపు నిచ్చారు. కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. కేజీబీవీలలో విద్యనభ్యసించే వారంతా చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారిని చదువుల్లో దిట్టలుగా చేయడం అదృష్టంగా భావించాలన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానంద రాజులు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా తెలుసుకున్న మరిన్ని కొత్త విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు బోధించడం ద్వారా వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్‌ఓ సంజీవరెడ్డి, రిసోర్సు పర్సన్లు సమగ్రశిక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు