
జాతీయస్థాయి హాకీ పోటీలకు క్రీడాకారిణుల ఎంపిక
ధర్మవరం: జాతీయస్థాయి హాకీ పోటీలకు జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారిణులు ఎంపికయ్యారని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ తెలిపారు. జూన్‌లో భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఆ పోటీల్లో ప్రతిభ కనబరిచి సింధు, పవిత్ర హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి కాకినాడలో జరుగుతున్న 15వ జాతీయస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలలో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారన్నారు. జాతీయస్థాయి హాకీ పోటీల్లోనూ ప్రతిభ చూపాలని హాకీ జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్ గౌడ్, చందు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్, అమునుద్దిన్, కిరణ్ ఆకాంక్షించారు.